గురువారం 26 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 09:48:38

జాగ్ర‌త్త‌లు తీసుకోండి.. ప్రజాస్వామ్య ఉత్స‌వంలో పాల్గొనండి

జాగ్ర‌త్త‌లు తీసుకోండి.. ప్రజాస్వామ్య ఉత్స‌వంలో పాల్గొనండి

హైద‌రాబాద్‌:  ఇవాళ బీహార్ అసెంబ్లీ తొలి ద‌ఫా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.  71 స్థానాల్లో ఉద‌యం 7 గంట‌ల‌కే పోలింగ్ ప్రారంభ‌మైంది.  అయితే పోలింగ్ నేప‌థ్యంలో ప్ర‌ధాని  మోదీ ట్వీట్ చేశారు.  బీహార్ అసెంబ్లీ పోరు కోసం ఇవాళ తొలి ద‌ఫా ఓటింగ్ జ‌రుగుతోంద‌ని,  ఓట‌ర్ల‌కు తాను విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని, అంద‌రూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొనాల‌న్నారు.  ప్ర‌జాస్వామ్య ఉత్సవంలో ఓట‌ర్లు అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని ప్ర‌ధాని అన్నారు.  రెండు గ‌జాల దూరం పాటిస్తూ.. మాస్క్‌ను త‌ప్ప‌కుండా ధ‌రించాల‌న్నారు. మ‌రో వైపు ఇవాళ ఉద‌యం జోరుగా పోలింగ్ ప్రారంభ‌మైంది.  8 గంట‌ల వ‌ర‌కు 5 శాతం ఓట్లు పోలైన‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న‌ది. ఇవాళ ఓటింగ్ జ‌రుగుతున్న ప్రాంతాల్లో ఇమామ్‌గంజ్‌, సాస‌రామ్‌, దినారా, గ‌యా, ముంగ‌ర్‌, జాముయి, మొకామా, జ‌మాల్‌పుర్‌, చైన్‌పుర్‌, బ‌క్స‌ర్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.  ఇవాళ జ‌రిగే 71 స్థానాల‌కు.. జేడీయూ 35, బీజేపీ 29, ఆర్జేడీ 42, కాంగ్రెస్ 20 చోట్ల పోటీప‌డుతున్న‌ది.  

ఓటింగ్ స‌మ‌యంలో అధికారులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ప్ర‌తి ఒక ఓట‌రుకు టెంప‌రేచ‌ర్ చెక్ చేస్తున్నారు.  ఓట‌ర్లు మాస్క్ ధ‌రించి పోలింగ్ బూత్‌కు వ‌స్తున్నారు.  దివ్యాంగ  ఓట‌ర్ల‌కు కూడా ప్ర‌త్యేక ఏర్పాట్ల చేశారు.  వారికి జ‌వాన్లు స‌హ‌క‌రిస్తున్నారు. ఒక పోలింగ్ బూత్‌కు 1000 నుంచి 1500 ఓట్ల‌ను కేటాయించారు.  80 ఏళ్లు దాటిని వారికి పోస్ట‌ల్ బ్యాలెట్ అవ‌కాశం క‌ల్పించారు.  రాహుల్ గాంధీ కూడా ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ఓట‌ర్ల‌కు అభ్య‌ర్థ‌న చేశారు. మ‌హాఘ‌ట్‌బంద‌న్‌కు ఓటు వేయాల‌ని ఆయ‌న కోరారు. బీహార్ ప్ర‌జ‌ల‌కు విషెస్ చెప్పిన రాహుల్‌.. ఆజ్ బ‌ద‌లేగా బీహార్ అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.