గురువారం 26 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 10:50:46

ఝాన్నీ లక్ష్మీబాయికి ప్రధాని నివాళి

ఝాన్నీ లక్ష్మీబాయికి ప్రధాని నివాళి

న్యూఢిల్లీ : ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఘన నివాళులర్పించారు. లక్ష్మీబాయి వీరత్వం దేశవాసులకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. స్వాతంత్రోద్యమ మొదటి యుద్ధంలో తన అద్భుతమైన పరాక్రమాన్ని పరిచయం చేసిన ధైర్యవంతురాలైన రాణి ఝాన్సీలక్షీబాయి అని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన రాణి లక్ష్మీబాయి ఇదే రోజు 1828లో వారణాసిలో జన్మించారు. మొదటి స్వాతంత్ర్య యుద్ధంగా పిలిచే 1857లో జరిగిన తిరుగుబాటులో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.