సోమవారం 25 జనవరి 2021
National - Dec 23, 2020 , 15:47:33

రైతుల‌కు కేంద్రం తీపి క‌బురు.. రెండ్రోజుల్లో ఖా‌తాల్లో రూ.2,000 చొప్పున జ‌మ‌

రైతుల‌కు కేంద్రం తీపి క‌బురు.. రెండ్రోజుల్లో ఖా‌తాల్లో రూ.2,000 చొప్పున జ‌మ‌

న్యూఢిల్లీ: ‌కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద మ‌రో విడ‌త‌ ఒక్కో రైతుల‌ ఖాతాలో రూ.2000 చొప్పున జ‌మ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. అందుకు అవ‌స‌ర‌మ‌య్యే నిధులను ఈ నెల 25న‌ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు. దేశంలో మొత్తం 9 కోట్ల మందికి పైగా ఉన్న‌ రైతులకు మ‌రో విడత‌ ఆర్థిక చేయూత అందించ‌డం కోసం రూ.18,000 కోట్ల‌కుపైగా నిధులను ప్ర‌ధాని నిధులను విడుద‌ల చేయ‌నున్నారు. 

ఈ నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ దేశంలోని ఆరు వేర్వేరు రాష్ట్రాల‌కు చెందిన రైతుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ముచ్చ‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ సాధ‌క‌బాద‌కాల‌ను ప్ర‌ధానితో పంచుకోనున్నారు. పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం స‌హా, రైతు సంక్షేమం కోసం కేంద్రం చేప‌ట్టిన ఇత‌ర చ‌ర్య‌ల‌పై రైతులు త‌మ అనుభ‌వాల‌ను ప్ర‌ధానికి చెప్పనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీతోపాటు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కూడా పాల్గొన‌నున్నారు.

దేశంలోని రైతులందరికీ ఆర్థిక సాయం అందించ‌డం కోసం ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ ప‌థ‌కం కింద ప్ర‌తి ఏడాది ఒక్కో రైతు ఖాతాలో ఆర్థిక సాయంగా రూ.6,000 చొప్పున జ‌మ చేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సాయాన్ని ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడుత‌ల్లో రూ.2,000 చొప్పున ఇస్తున్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండి..

రైతు ఆందోళ‌న‌ల‌కు కేర‌ళ మ‌ద్ద‌తు : సీఎం విజ‌య‌న్‌

రైతులు ఉద్యమాన్ని ఉపసంహరిస్తారని భావిస్తున్న : రాజ్‌నాథ్‌

నేటి నుంచి క‌ర్ణాట‌క‌లో రాత్రి క‌ర్ఫ్యూ

రాహుల్‌గాంధీకి ఆలుగ‌డ్డ ఎట్ల పెరుగుత‌దో తెలియ‌దు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 


logo