సోమవారం 03 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 18:30:33

21వ శతాబ్ధం..విజ్ఞానయుగం: ప్రధాని మోదీ

21వ శతాబ్ధం..విజ్ఞానయుగం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:  భారత్‌లో నాణ్యమైన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనదేశంలోని విద్యార్థుల  కోసం  అధునాతన విద్యావ్యవస్థను అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2020లో పాల్గొన్న విద్యార్థులనుద్దేశించి  ప్రధాని  మోదీ  వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు

'21వ శతాబ్దం విజ్ఞాన యుగం. లెర్నింగ్‌, రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌లపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.   భారత నూతన జాతీయ విద్యావిధానం 2020ని ఇందులో భాగంగానే తీసుకొచ్చాం.  నాణ్యమైన విద్య కోసం మార్పులు చేస్తున్నాం.  ఇటీవల ప్రకటించిన జాతీయ విద్యావిధానం మన దేశంలోని 21వ శతాబ్దపు యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాం.  విద్యావిధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల భారతదేశ భాషలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఇది భారతదేశ విజ్ఞానాన్ని పెంచడమే కాక,  జాతీయ ఐక్యతను పెంపొందిస్తుందని' మోదీ పేర్కొన్నారు. 


logo