శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 05:48:07

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

ఢిల్లీ:  కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన లాక్‌డౌన్ 3.0 ముగియ‌డానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం ఉంది. భ‌విష‌త్య్‌లో ఎలా ముందుకు వెళ‌దామ‌నే విష‌యంపై రాష్ట్రాల ముఖ్యమంతుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం కానున్నారు. మార్చ్ 20వ తేదీన మొద‌టి సారి క‌రోనా వైర‌స్ వ్యాప్తి, లాక్‌డౌన్ విష‌యంపై సీఎంల‌తో మాట్లాడారు. అప్ప‌టి నుంచి సీఎంల‌తో ఇది ఐదో స‌మావేశం. తొలి విడ‌త లాక్‌డౌన్ ప్ర‌క‌టించే నాటికి దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 606.  రెండో విడ‌త లాక్‌డౌన్ నాటికి కేసుల సంఖ్య 10,815కు పెరిగింది. మూడో విడ‌త లాక్‌డౌన్ ప్రారంభం నాటికి 40,263కు చేరుకుంది.

 ప్ర‌స్తుతం రెడ్‌జోన్‌, ఆరెంజ్ జోన్‌ల‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్నా కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 63 వేల‌కు చేరుకుంది. దేశ ఆర్థిక ప‌రిస్థితి, రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితి పూర్తిగా దిగ‌జారుతున్నా లాక్‌డౌన్ కొన‌సాగిస్తుండ‌టంతో కొద్దిగా వైర‌స్ వ్యాప్తి అదుపులో ఉన్నా 10 రోజుల్లో 20 వేల కేసులు పెర‌గ‌డం ఆదోళ‌న క‌లిగించే విష‌య‌మే. దీనిపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ప్ర‌ధాని తీసుకోనున్నారు. ప్ర‌జా ర‌వాణా, ఆఫీసులు, వ్యాపార‌, వాణిజ్య, ఫ్యాక్ట‌రీలు ఎలా ప్రార‌భించాలి. లాక్‌డౌన్ నుంచి ఎలా బ‌య‌ట‌కు రావాలి, ప్ర‌జ‌ల జీవ‌నోపాధికి స‌మ‌స్య‌లు రాకుండా ఎలా ముందుకు వెళ్దాం అనే అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.  రాష్ట్రాల ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌వుతున్న వేళ కేంద్ర ఎటువంటి స‌హాయం అందించ‌డం లేద‌ని దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మండిప‌డుతున్నారు. 


logo