బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 13:33:52

సీ ప్లేన్ ఫ్లైట్‌లో కెవాడియా నుంచి స‌బ‌ర్మ‌తికి ప్ర‌ధాని

సీ ప్లేన్ ఫ్లైట్‌లో కెవాడియా నుంచి స‌బ‌ర్మ‌తికి ప్ర‌ధాని

అహ్మ‌దాబాద్: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతున్న‌ది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం శుక్ర‌వారం ఉద‌యం గుజ‌రాత్‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. నిన్న‌టి నుంచి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. తాజాగా కెవాడియాలోనే స్టాట్యూ ఆఫ్ యూనిటీ వ‌ద్ద దేశ మొట్ట‌మొద‌టి హోంమంత్రి స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్‌కు నివాళులు అర్పించారు. అనంత‌రం స‌బ‌ర్మ‌తి న‌ది గుండా సీ ప్లేన్ ఫ్లైట్‌లో కెవాడియా నుంచి స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి వెళ్లారు.  ‌  

గుజ‌రాత్ ప్ర‌భుత్వం అహ్మ‌దాబాద్‌లోని స‌బ‌ర్మ‌తి న‌దీ ముఖ‌ద్వారం, కెవాడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీని అనుసంధానం చేస్తూ ఒక సీ ప్లేన్ ఫ్లైట్‌ను న‌డుపుతున్న‌ది. ఆ ఫ్లైట్‌లోనే ప్ర‌ధాని కెవాడియా నుంచి స‌బ‌ర్మ‌తికి చేరుకున్నారు. శుక్ర‌వారం ఉద‌యం కూడా ప్ర‌ధాని న‌ర్మ‌దా జిల్లా కెవాడియాలోని ఆరోగ్య‌వ‌న్ పార్కును ప్రారంభించారు. అనంత‌రం ఏక్తా మాల్‌ను లాంచ్ చేశారు. ఆ త‌ర్వాత‌ చిల్డ్ర‌న్ న్యూట్రిష‌న్ పార్కును ప్రారంభించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.