మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 14, 2020 , 15:05:08

స‌రిహ‌ద్దుల్లో యుద్ధట్యాంకుపై ప్ర‌యాణించిన ప్ర‌ధాని..వీడియో

స‌రిహ‌ద్దుల్లో యుద్ధట్యాంకుపై ప్ర‌యాణించిన ప్ర‌ధాని..వీడియో

జైపూర్‌: ‌రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌ స‌రిహ‌ద్దుల్లో సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అంత‌కుముందు కాసేపు యుద్ధ‌ట్యాంకుపై ప్ర‌యాణం చేశారు. ఓ సైనికుడు యుద్ధ ట్యాంకును న‌డుపుతుండ‌గా ప్ర‌ధాని మోదీ దానిపై నిల‌బ‌డి దారి పొడ‌వునా క‌నిపించిన‌ సైనికులంద‌రికీ అభివాదం తెలుపుతూ ముందుకు క‌దిలారు. అనంత‌రం సైనికుల‌కు స్వీట్లు పంచి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ ర‌క్ష‌ణ కోసం సైనికులు చేస్తున్న త్యాగాన్ని కొనియాడారు. జై బోలో భార‌త్ మాతా కీ అంటూ సైనికుల‌తో క‌లిసి నినాదాలు చేశారు. ప్ర‌ధాని యుద్ధ ట్యాంకుపై ప్ర‌యాణించిన దృశ్యాల‌ను కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.