గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 12:28:12

రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని మాట్లాడుతారు. లాక్‌డౌన్‌పై నిన్న అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధాని సమీక్షించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్త లాక్‌డౌన్‌  నేటితో 49వ రోజుకు చేరుకుంది. దేశంలో 70,756 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. కోవిడ్‌-19 కారణంగా దేశంలో ఇప్పటి వరకు 2,293 మంది మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఢిల్లీ రాష్ర్టాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.


logo