మంగళవారం 26 జనవరి 2021
National - Dec 18, 2020 , 17:30:12

ప్రధాని మోదీ ‘వారణాసి ఆఫీస్‌’ ఫర్‌ సేల్‌

ప్రధాని మోదీ ‘వారణాసి ఆఫీస్‌’ ఫర్‌ సేల్‌

వారణాసి:  నమ్మేవాడు ఉంటే మోసగాళ్లు.. ప్రెజెంట్‌ టెక్నాలజీ యుగంలో సైబర్‌ నేరగాళ్లు ఏదైనా చేయడానికి సమర్థులే. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌ లో ఓ ఘటన జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ.. లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయన కార్యాలయాన్ని దుండగులు రూ.7.5 కోట్లకు అమ్మకానికి పెట్టారు. ఇందుకోసం వారణాసి ప్రధాని కార్యాలయం ఫొటోను ఒఎల్‌ఎక్స్‌ వెబ్‌‌సైట్‌‌లో పెట్టారు. 

ఈ సంగతి తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయడంతో జవహార్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన నలుగురు ఈ మోసానికి దిగినట్లు తేలింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తేవడంతో సదరు వాణిజ్య ప్రకటనను ఆ వెబ్‌ సైట్‌ నుంచి తొలిగించి.. దాని యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

వారణాసిలోని రవీంద్రపురి ఏరియాలోని ఒక విల్లాలో ప్రధాని మోదీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగు గదులు, నాలుగు బాత్‌ రూంలు ఉన్నాయి. మొత్తం కార్యాలయం 6500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. లక్ష్మీకాంత్‌ ఓజా అనే వ్యక్తి విక్రేతగా అడ్వర్టైజ్‌మెంట్‌లో పేర్కొన్నాడు.


logo