మంగళవారం 31 మార్చి 2020
National - Mar 09, 2020 , 15:56:58

ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన రద్దు!

ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన రద్దు!

న్యూఢిల్లీ : చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్.. ఇతర దేశాలను వణికిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మూడు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 17వ తేదీన బంగ్లాదేశ్ లో జరగనున్న షేక్ ముజిబుర్ రెహమాన్ శతాబ్ది జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని షేక్ హాసినా మోదీని ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ కు వెళ్లాలనుకున్నారు. కానీ అక్కడ మూడు కరోనా కేసులు నమోదు కావడంతో.. తన పర్యటనను వాయిదా వేసుకోవాలని మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది. కరోనా వైరస్ కారణంగా బ్రసెల్స్ పర్యటనను కూడా మోదీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.


logo
>>>>>>