శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 16:55:26

గిర్నార్ రోప్‌వేను ప్రారంభించిన ప్ర‌ధాని

గిర్నార్ రోప్‌వేను ప్రారంభించిన ప్ర‌ధాని

అహ్మ‌దాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లోని గిర్నార్‌లో రోప్‌వేను ప్రారంభించారు. రోప్‌వే వ‌ల్ల‌ స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయ‌ని, దాంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్ర‌ధాని అన్నారు. గిర్నార్ రోప్‌వేతోపాటు గుజరాత్‌లో మరో రెండు ప్రాజెక్టులను వీడియో లింక్ ద్వారా ప్రధాని ప్రారంభించారు.  

'గిర్నార్ పర్వతంపై దేవీ అంబ ఉంది. గోరఖ్‌నాథ్ పీక్‌, గురు దత్తాత్రేయ పీక్, జైన్ ఆలయం కూడా గిర్నార్ కొండలపై ఉన్నాయి. పర్వత ప్రాంతంపైకి చేరాలంటే మెట్లు ఎక్కి వెళ్లాలి. అక్కడకు వెళ్లిన వారిలో ఒక రకమైన శక్తి, ప్రశాంతత క‌లుగుతాయి. ఇప్పుడు ప్రపంచ స్థాయి రోప్‌-వేతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్వత ప్రాంతాలను చూడవచ్చు' అని ప్రధాని పేర్కొన్నారు. 

'గిర్నార్ రోప్‌వేలో 25 నుంచి 30 క్యాబిన్లు ఉంటాయి. ఒక్కో క్యాబిన్‌లో 8 మంది ఎక్కే అవకాశం ఉంటుంది. 2.3 కిలోమీటర్ల దూరాన్ని ఈ రోప్‌వేతో కేవలం 7.5 నిమిషాల్లో చేరుకోవచ్చు. గిర్నార్ పర్వతం చట్టుపక్కల ఉన్న ఆకుపచ్చని అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. రోప్‌వే సౌకర్యంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగనుంది' అని ప్రధాని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.