గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 13:43:22

రామ మందిర ఉద్య‌మం నుంచి పుట్టిన నేత ప్ర‌ధాని మోదీ

రామ మందిర ఉద్య‌మం నుంచి పుట్టిన నేత ప్ర‌ధాని మోదీ

ల‌క్నో : విశ్వ హిందూ ప‌రిష‌త్ ప్రారంభించిన  రామ మందిర నిర్మాణ ఉద్య‌మం నుంచి పుట్టిన నేత ప్ర‌ధాని మోదీ అని రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ అన్నారు.  గుజ‌రాత్‌లోని సోమ‌నాథ్ ఆల‌యాన్ని మాజీ రాష్ర్ట‌ప‌తి రాజేంద్ర ప్ర‌సాద్ సంద‌ర్శించిన‌ట్లుగా అయోధ్య‌లోని రామ మందిర భూమి పూజ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ పాల్గొంటార‌ని ఆయ‌న అన్నారు. 

ఆగస్టు 5 న జరిగే భూమి పూజ కార్యక్రమానికి హాజర‌య్యే అతిథుల గురించి ఆయ‌న మాట్లాడుతూ... భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అతిథుల సంఖ్య‌ రోజూ రోజు త‌గ్గుతూ పోతుంద‌న్నారు. కాగా ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఆగస్టు 5న బానిసత్వ చిహ్నాన్ని తొలగించి అయోధ్యలో ఒక గొప్ప రామాల‌యాన్ని నిర్మిస్తామని రాయ్ అన్నారు.

రామ జన్మభూమికి సంబంధించిన చరిత్ర, వాస్తవాలను నమోదు చేసిన టైమ్ క్యాప్సూల్‌ను అయోధ్యలోని రామాల‌యం క్రింద ప్ర‌ద‌ర్శ‌న‌గా ఉంచనున్న‌ట్లు తెలిపారు. భూమి పూజ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సిందిగా గుజ‌రాత్‌కు చెందిన ఆరుగురు సాధువుల‌ను ఆహ్వానించిన‌ట్లు చెప్పారు. 


logo