మంగళవారం 19 జనవరి 2021
National - Jan 07, 2021 , 10:17:41

ట్రంప్ మ‌ద్ద‌తుదారుల‌పై మోదీ అస‌హ‌నం

ట్రంప్ మ‌ద్ద‌తుదారుల‌పై మోదీ అస‌హ‌నం

న్యూఢిల్లీ: అమెరికాలోని కాపిట‌ల్ హిల్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ద్ద‌తుదారులు చేసిన దాడిని ఖండించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఇలా చ‌ట్ట విరుద్ధ నిర‌స‌న‌ల‌తో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను అడ్డుకునే చ‌ర్య‌ల‌ను స‌హించ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన దాడుల వార్త‌లు చూసి చాలా బాధ క‌లిగింది. శాంతియుతంగా, క్ర‌మబ‌ద్ధంగా అధికార బ‌దిలీ జ‌ర‌గాలి. ఇలాంటి చ‌ట్ట‌విరుద్ధ నిర‌స‌న‌ల‌తో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను అడ్డుకునే చ‌ర్య‌ల‌ను స‌హించ‌కూడ‌ద‌ని మోదీ ట్వీట్ చేశారు. న‌వంబ‌ర్ 3న జ‌రిగిన ఎన్నిక‌ల‌ను త‌మ నుంచి దొంగిలించార‌ని, త‌మ గ‌ళాలు వినాలంటూ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ద్ద‌తుదారులు కాపిట‌ల్ హిల్‌పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర‌స‌న హింసాత్మ‌కంగా మార‌డంతో పోలీసులు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది. ఇందులో ఒక మ‌హిళ మృతి చెంద‌గా.. ప‌లువురు పోలీసుల‌కు గాయాల‌య్యాయి. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌పంచ నేత‌లు ఖండించారు.