ఆదివారం 24 జనవరి 2021
National - Dec 24, 2020 , 13:08:02

పారిస్ ఒప్పందం లక్ష్యాల దిశగా భార‌త్ : ప‌్ర‌ధాని మోదీ

పారిస్ ఒప్పందం లక్ష్యాల దిశగా భార‌త్ : ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్ శాంతినికేత‌న్‌లోని విశ్వభార‌తి యూనివ‌ర్సిటీ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ ఇవాళ వీడియో ప్ర‌సంగం చేశారు. వాతావ‌ర‌ణ మార్పుల‌పై కుదిరిన పారిస్ ఒప్పందం దిశ‌గా వెళ్తున్న ఏకైక దేశం భార‌త్ అని ప్ర‌ధాని వెల్ల‌డించారు. స్వాతంత్య్ర స‌మ‌రం నాటి రోజుల్లో గురుదేవ్ ర‌వీంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలోని విశ్వ‌భార‌తి వ‌ర్సిటీ భార‌త జాతీయ మ‌నోభావాల‌కు అద్దంలా నిలిచింద‌న్నారు. భార‌తీయ ఆధ్మాత్మిక చింత‌న ద్వారా యావ‌త్ మాన‌వాళి ల‌బ్ధి పొందాల‌ని ఠాగూర్ భావించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  ఆ మ‌నోభావాల‌కు త‌గిన‌ట్లుగానే ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ విజ‌న్‌ను రూపొందించిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. ఈ వ‌ర్సిటీ ఏర్పాటుకు దారి తీసిన అంశాల‌ను గుర్తు చేసుకోవాల‌ని, ఇది కేవ‌లం బ్రిటీష్ పాల‌న మాత్ర‌మే కాదు అని, మ‌న దేశానికి చెందిన వంద‌లాది సంవ‌త్స‌రాల చరిత్ర‌కు సాక్ష్య‌మ‌ని మోదీ అన్నారు.  


logo