బాహుబలి 2 తర్వాత సినిమాలు చేయని రానా..నాలుగేళ్ల తర్వాత అరణ్యతో వచ్చాడు. ప్రశంసలు దక్కుతున్న ఈ సినిమాకు పైసలు మాత్రం రావడం లేదు. తొలిరోజు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. చాలా చోట్ల ఈ సినిమా పూర్తిగా డల్ అయిపోయింది. కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అరణ్య సినిమా మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..
ఈ చిత్రం 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం- 0.84 కోట్లు
సీడెడ్- 0.37 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.40 కోట్లు
ఈస్ట్- 0.22 కోట్లు
వెస్ట్- 0.16 కోట్లు
గుంటూరు- 0.32 కోట్లు
కృష్ణా- 0.19 కోట్లు
నెల్లూరు- 0.10 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 2.60 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.32 కోట్లు
ఓవర్సీస్- 0.18 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 4.10 కోట్లు
‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 15 కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అది అసాధ్యంగా కనిపిస్తోంది. దాంతో రానా దగ్గుబాటికి మరో ఫ్లాప్ తప్పేలా లేదు. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ కమర్షియల్ గా మాత్రం సేఫ్ కావడం కష్టం.