శనివారం 16 జనవరి 2021
National - Jan 14, 2021 , 15:52:18

బీజేపీలోకి మోదీ న‌మ్మిన బంటు

బీజేపీలోకి మోదీ న‌మ్మిన బంటు

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి న‌మ్మిన బంటుగా ఉన్న‌ మాజీ ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్ శ‌ర్మ గురువారం బీజేపీలో చేరారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో న‌గ‌రంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న బీజేపీ స‌భ్య‌త్వం తీసుకున్నారు. యూపీ రాజ‌కీయాల్లో అర‌వింద్ కుమార్ శ‌ర్మ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు.

1988 గుజ‌రాత్ క్యాడ‌ర్ ఐఏఎస్ అధికారి అయిన అర‌వింద్ కుమార్ శ‌ర్మ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మావు ప్రాంత వాసి. ఈ నెల 28న జ‌రిగే రాష్ట్ర శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో  ఆయ‌న ఎమ్మెల్సీగా ఎన్నికవ్వ‌నున్నారు. 

కేంద్ర సూక్ష్మ చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల (ఎంఎస్ఎంఈ)శాఖ కార్య‌ద‌ర్శిగా ఆయ‌న ప‌నిచేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ.. గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచి విధాన‌నిర్ణ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. 2001లో న‌రేంద్ర‌మోదీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీకరించిన‌ప్ప‌టినుంచి 2014 వ‌ర‌కు సీఎం కార్య‌ద‌ర్శిగా అర‌వింద్ కుమార్ శ‌ర్మ ప‌ని చేశారు.

వివిధ ప‌థ‌కాల్లో ఫ‌లితాల సాధించ‌డంలో అర‌వింద్‌కుమార్ శ‌ర్మ మేటి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మోదీకి అత్యంత విశ్వ‌సనీయుడిగా పేరొందారు. 2014లో మోదీ ప్ర‌ధానిగా ఎన్నికైన త‌ర్వాత కేంద్రానికి వ‌చ్చిన అర‌వింద్ కుమార్ శ‌ర్మ‌.. కేంద్ర అధికారుల్లోనే లో ప్రొఫైల్ లో కొన‌సాగిన అధికారిగా నిలిచారు. గ‌తేడాది మేలో ఎంఎస్ఎంఈ శాఖ‌కు మారిన అర‌వింద్ కుమార్ శ‌ర్మ‌... క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ రంగానికి ఉప‌శ‌మ‌నం కోసం ప‌ని చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.