శనివారం 06 మార్చి 2021
National - Jan 19, 2021 , 03:25:05

పాక్‌లో మోదీ పోస్టర్లు

పాక్‌లో మోదీ పోస్టర్లు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. తమకు పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కావాలని పోరాడుతున్న సింధీలు సోమవారం సింధ్‌ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఫొటోలు ఉన్న పోస్టర్లను పట్టుకొన్నారు. మోదీతో పాటు జో బైడెన్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌, బోరిస్‌ జాన్సన్‌, ఎంజెలా మెర్కెల్‌ తదితర అంతర్జాతీయ నేతల ఫొటోలు ఉన్న ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. తమ స్వాతంత్య్రోద్యమంలో జోక్యం చేసుకోవాలని ఆ నేతలకు విజ్ఞప్తి చేశారు. 

VIDEOS

logo