శనివారం 28 మార్చి 2020
National - Mar 19, 2020 , 20:38:35

ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ: ప్రధాని నరేంద్ర మోదీ

ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ: ప్రధాని నరేంద్ర మోదీ

ఢిల్లీ:  మీకు మీరు క‌ర్ఫ్యూ విధించుకోవాలి. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు.  ఇంట్లోనే ఉండాలి. ప్ర‌జా క్షేమం కోసం ఈ నియ‌మం త‌ప్ప‌దు. ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉంటేనే.. ప్ర‌పంచం ఆరోగ్యంగా ఉంటుంది.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు ఇది అవ‌స‌రం.  ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను ఆయ‌న చెప్పారు.  జ‌న‌తా క‌ర్ఫ్యూను ఈ ఆదివారం చేప‌ట్టాల‌ని ఆయ‌న సూచించారు.  ఇంటి వ‌ద్ద‌, బాల్కనీలో నిలుచుని 22వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌కు జ‌నాల్ని జాగృతం చేయాల‌న్నారు.  సేవే ప‌ర్మోధ‌ర్మం.. అన్న భార‌త విధానాన్ని అవ‌లంబించాల‌న్నారు. డాక్ట‌ర్ల నుంచి వీలైన‌న్ని స‌ల‌హాలు తీసుకోండి.  తెలిస‌న డాక్ట‌ర్ల‌ను వీలైనంత త్వ‌ర‌గా సంప్ర‌దించండి.

మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థకు తీవ్ర ఇబ్బంది ఎదుర‌వుతోంది.  కోవిడ్‌19 ఎక‌నామిక్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.  ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఆ టాస్క్ ఫోర్స్ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప్ర‌జ‌లంతా బాధ్య‌తాయుతంగా ఉండాల‌న్నారు.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల‌ను పాటించాల‌న్నారు. కుటుంబాన్ని వ్యాధి నుంచి ర‌క్షించుకోవ‌డం సామాజిక బాధ్య‌త‌.  అవ‌స‌ర‌మైన మందులు ద‌గ్గ‌ర ఉంచుకోండి.  కానీ మందులు నిత్యం స‌ర‌ఫ‌రా చేస్తూనే ఉంటామ‌న్నారు.  గ‌త రెండు నెల‌ల నుంచి 130 కోట్ల మంది భార‌తీయులు.. క‌రోనా సంక‌టాన్ని ఎదుర్కొన్నార‌న్నారు.  రానున్న రోజుల్లో ప్ర‌జ‌లు త‌మ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తార‌ని ఆశిస్తున్నాన‌న్నారు.  

ఈ సంక‌టం ఎంత పెద్ద‌ది అంటే.. ఒక దేశం మ‌రో దేశానికి స‌హాయం చేయ‌లేని స్థితిలో ఉంద‌న్నారు.  ఈ క‌ఠిన సంద‌ర్భాన్ని ఎదుర్కోవాల్సి ఉంద‌న్నారు. మ‌న పూర్తి సామ‌ర్థ్యాన్ని వినియోగించాల‌న్నారు.  క‌రోనా నుంచి బ్ర‌తికి బ‌య‌ట‌ప‌డాలంటే ఇది త‌ప్ప‌ద‌న్నారు.  గ్రామాలు, పంచాయ‌తీలు.. మ‌హ‌మ్మారి నుంచి బ్ర‌తికేందుకు వీలైనంత చేస్తున్నాయి.  మాన‌వ జాతి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నారు.  భార‌త జాతి విజయం సాధించాల‌న్నారు. న‌వ‌రాత్రి ప‌ర్వ‌దినాలు వ‌స్తున్నాయి. ఈ సంక‌ట‌ స‌మ‌యంలో సంక‌ల్పం కావాల‌న్నారు.  హ‌మ్ బీ బ‌చే, దేశ్ కో బ‌చావ్‌, విశ్వ‌కో బ‌చావో అన్న నినాదం ఇచ్చారు. ఈనెల 22న మాత్రం ప్ర‌జ‌లు ఎవ‌రూ రోడ్డుపైకి రావొద్దు.  ఇది గుర్తుపెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 


logo