గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 17:48:21

86 నిమిషాల మోదీ ప్ర‌సంగం.. ఆ మూడు ప‌దాలకే ప్రాధాన్య‌త‌

86 నిమిషాల మోదీ ప్ర‌సంగం.. ఆ మూడు ప‌దాలకే ప్రాధాన్య‌త‌

న్యూఢిల్లీ : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. 74వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా మోదీ 86 నిమిషాల పాటు సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ అనంత‌రం ఎర్ర‌కోట వేదిక‌గా ప్ర‌సంగించిన మోదీ.. త‌న సుదీర్ఘ ప్ర‌సంగంలో కేవ‌లం ఆ మూడు ప‌దాల‌కే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. కేంద్రం ప్ర‌క‌టించిన‌ రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన‌ ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ గురించి మోదీ ప‌దేపదే ప్రస్తావించారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్‌తో పాటు క‌రోనా, సిటిజెన్స్, రైతులు, మ‌హిళ‌లు, డెవ‌ల‌ప్‌మెంట్ ప‌దాల చుట్టే ప్ర‌ధాని ప్ర‌సంగం కొన‌సాగింది. 

86 నిమిషాల సుదీర్ఘ ప్ర‌సంగంలో ఆత్మ‌నిర్భ‌ర్ ప‌దాన్ని 32 సార్లు, సిటిజెన్స్ ప‌దాన్ని 32 సార్లు, క‌రోనాను 25 సార్లు, రైతులు అనే ప‌దాన్ని 22 సార్లు, ఫ్రీడంను 24 సార్లు, వుమెన్ అనే ప‌దాన్ని 21 సార్లు, రూర‌ల్ 15, డెవ‌ల‌ప్‌మెంట్ 18, పేద‌రికం 15, ఆర్మీ అనే ప‌దాన్ని 19 సార్లు ఉప‌యోగించారు మోదీ. 


logo