శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 10:04:44

మోదీ త‌ల‌పాగ.. ఇదీ ప్ర‌త్యేక‌త‌

మోదీ త‌ల‌పాగ.. ఇదీ ప్ర‌త్యేక‌త‌

న్యూఢిల్లీ:  ప్ర‌ధాని మోదీ ఇవాళ ప్ర‌త్యేక ప‌గిడీ ధ‌రించారు.  గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న కొత్త లుక్‌లో క‌నిపించారు.  త‌ల‌కు ఎర్ర‌టి త‌ల‌పాగ‌ పెట్టుకున్నారు.  నేష‌న‌ల్ వార్ మెమోరియ‌ల్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఆయ‌న ఈ పగిడీలో ద‌ర్శ‌న‌మిచ్చారు. గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌కు.. మోదీ ధ‌రించిన ప‌గిడీకి ప్ర‌త్యేక సంబంధం ఉన్న‌ది.  జామ్‌న‌గ‌ర్‌కు చెందిన రాజ కుటుంబీకులు ఈ త‌ల‌పాగ‌ను మోదీకి బ‌హూక‌రించారు. ప్ర‌త్యేక వేష‌ధార‌ణ‌తో ఆక‌ట్టుకునే ప్ర‌ధాని ఇవాళ కూడా ఈ స్పెష‌ల్ డ్రెస్సులో ద‌ర్శ‌న‌మిచ్చారు. 

VIDEOS

logo