మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 20:07:58

కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు


న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ జీకి శుభాకాంక్షలు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజల కలలు, ఆశయాలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఆప్ 62 స్థానాలు గెలవగా..బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందాయి. logo