బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 21:37:33

రేపు అంఫాన్‌ ప్రభావిత బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు ప్రధాని

రేపు అంఫాన్‌ ప్రభావిత బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను సందర్శించనున్నారు. అంఫాన్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆ రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితి ప్రధాని పరిశీలించనున్నారు. ముందుగా పశ్చిమబెంగాల్‌కు చేరుకుని హెలిక్యాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న రక్షణ, పునరావాస చర్యలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఆ తర్వాత ఒడిశాలో సైతం ప్రధాని ఏరియల్‌ సర్వే చేసి, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. 

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారి ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాల నడుమ తీరాన్ని తాకింది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పంటలు ధ్వంసమయ్యాయి. పలు తీర ప్రాంత గ్రామాల్లో నివాసాలు దెబ్బతిన్నాయి. అయితే ఒడిశాతో పోల్చితే పశ్చిమబెంగాల్‌పై తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. అంఫాన్‌ తుఫాన్‌ ఆ రాష్ట్రంలో 72 మందిని పొట్టనపెట్టుకుంది.


logo