e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News సెంట్ర‌ల్ విస్టా ప‌నులు అక‌స్మికంగా త‌నిఖీ చేసిన ప్ర‌ధాని మోదీ

సెంట్ర‌ల్ విస్టా ప‌నులు అక‌స్మికంగా త‌నిఖీ చేసిన ప్ర‌ధాని మోదీ

PM Modi @ Central Vista | మూడు రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకుని ఆదివారం ఢిల్లీకి చేరుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ.. నూత‌న పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ విస్టా ప‌నుల పురోగ‌తిని అక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఎటువంటి స‌మాచారం లేకుండా, సెక్యూరిటీ లేకుండానే ఆయ‌న అక్క‌డికి చేరుకున్నారు. రాత్రి 8.45 గంట‌ల‌కు సంద‌ర్శించి గంట సేపు గ‌డిపారు. నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు.

దీనికోసం రూ.238 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. న్యూ పార్ల‌మెంట్ భ‌వ‌నం, సెంట్ర‌ల్ విస్టా ఎవెన్యూ నిర్మాణానికి రూ.63 కోట్లు వెచ్చించింది. నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి రూ.971 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేశారు. 2022 అక్టోబ‌ర్ నాటికి నిర్మాణం పూర్త‌వుతుంద‌ని అంచ‌నా.

- Advertisement -

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి ఇండియా గేట్ వ‌ర‌కు సెంట్ర‌ల్ విస్టాను క‌లిపేందుకు చేప‌ట్టిన ప్రాజెక్టు ఈ ఏడాది న‌వంబ‌ర్ క‌ల్లా పూర్త‌వుతుంద‌ని అధికారులు భావిస్తున్నారు. దీని ఖ‌ర్చు రూ.608 కోట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. రెండు ప్రాజెక్టుల కోసం ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1,289 కోట్లు ఖర్చ‌వుతుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement