మంగళవారం 31 మార్చి 2020
National - Mar 21, 2020 , 02:00:30

సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ దిశానిర్దేశం

సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ దిశానిర్దేశం

న్యూఢిల్లీ: దేశంలో వేగంగా వ్యాప్తిస్తున్న కరోనాను కలిసికట్టుగా కట్టడి చేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల సహకారం, సామాజిక దూరాన్ని పక్కగా అమలు చేయడంతోనే ఇది సాధ్యమన్నారు. అన్ని రాష్ర్టాల సీఎంలతో శుక్రవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్య సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై సీఎంలతో మోదీ చర్చించారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ నియంత్రణకు వ్యాపా ర సంఘాలతో వీడియో సమావేశాలు నిర్వహించాన్నారు. అవసరమైతే కఠిన చర్యలు, చట్టాల అమలులో వెనుకాడవద్దన్నారు. వైరస్‌ పరీక్షాకేంద్రాల ఏర్పాటు, కేంద్రం సహకారం, ముందస్తు బడ్జెట్‌ నిధుల విడుదల వం  అంశాలను సీఎంలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సీఎంల నుంచి సూచనలు స్వీకరించిన మోదీ, కరోనా నియంత్రణకు వారు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>