గురువారం 26 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 13:52:28

‘స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌’ను ఆవిష్కరించడం నా అదృష్టం : మోదీ

‘స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌’ను ఆవిష్కరించడం నా అదృష్టం : మోదీ

జైపూర్‌ : రాజస్థాన్‌ పాళిలో జైనా ఆచార్యుడు విజయ్‌ వల్లభ్‌ సురేశ్వర్‌ విగ్రహాన్ని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్‌ భూమి ఇద్దరు వల్లబ్‌లను ఇచ్చిందని నిత్యానంద్‌ సురేశ్వర్‌ చెప్పేవారన్నారు. ఒకరు రాజకీయ రంగంలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌, ఆధ్యాతిక రంగంలో జైనా ఆచార్యుడు విజయ్‌ వల్లబ్‌ దేశం ఐక్యత, సోదరభావం కోసం ఇద్దరు తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం(స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ)తో పాటు స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. రాజస్థాన్‌ రాష్ట్రం పాళీలోని జెట్‌పురాలోని విజయ్‌ వల్లభా సాధన కేంద్రంలో విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. 151 అంగుళాల పొడవు ఉన్న విగ్రహాన్ని.. అష్టధాతువుల (ఎనిమిది లోహాలు)తో తయారు చేయారు. విజయ్ వల్లభ సురేశ్వర్‌ జీ మహారాజ్ (1870-1954) మహావీరుడి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు జీవితాంతం కృషి చేశారు. కవితలు, వ్యాసాలు, భక్తి శ్లోకాలతో ప్రజల సంక్షేమం, విద్యావ్యాప్తి, సామాజిక చైతన్యం కోసం పాటుపడ్డారు. అలాగే స్వాతంతోద్యమం, స్వదేశీ ఉద్యమానికి సైతం మద్దతు ఇచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.