సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 05:50:41

మోదీ ‘పద్మ’ క్విజ్‌ గెలిస్తే పద్మ అవార్డుల

మోదీ ‘పద్మ’ క్విజ్‌ గెలిస్తే పద్మ అవార్డుల
  • వేడుకకు హాజరయ్యే అవకాశం

న్యూఢిల్లీ: పద్మ అవార్డుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సోషల్‌మీడియా వేదికగా క్విజ్‌ పోటీ నిర్వహించారు. సరైన సమాధానాలు పంపినవారికి ఈ నెల 20న రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించే దేశంలో అత్యున్నత పౌరపురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. క్విజ్‌ పోటీలో పాల్గొని, అధిక మార్కులు సాధించి గొప్ప కార్యక్రమానికి విచ్చేసే అవకాశాన్ని పొందాలని తన సోషల్‌మీడియా అనుచరులకు మోదీ సూచించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉన్న 20 ప్రశ్నలకు సంబంధించిన లింకును కూడా ట్వీట్‌చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి పద్మ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.


logo