బుధవారం 03 జూన్ 2020
National - Apr 04, 2020 , 12:05:53

ఆవో దియా జెలాయే : ప్రధాని ట్వీట్‌

ఆవో దియా జెలాయే : ప్రధాని ట్వీట్‌

హైద‌రాబాద్‌: కోవిడ్‌19పై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు దీపాల‌ను వెల‌గించాల‌ని ప్రధాని మోదీ శుక్ర‌వారం వీడియో సందేశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో కూడా మ‌రో పోస్టును పెట్టారు.  ఆవో దియా జ‌లాయే అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.  మాజీ ప్రధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి వినిపించిన ఓ క‌విత‌ను ఆ ట్వీట్‌లో పోస్టు చేశారు.  ఆవో ఫిర్‌సే దియా జెలాయే అంటూ అట‌ల్ ఆ క‌విత వినిపిస్తారు.  కోవిడ్19పై పోరాటానికి సంఘీభావంగా లైట్ల‌ను ఆర్పివేసి.. దీపాల‌ను, కొవ్వొత్తుల‌ను వెల‌గించాల‌ని ప్రధాని పిలుపు ఇచ్చారు. logo