రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కోల్‌కతాలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించే ‘పరాక్రమ్ దివస్’లో పాల్గొని ప్రసగించనున్నారు. నేతాజీ దేశానికి చేసిన నిస్వార్థ సేవను గౌరవించేందుకు, గుర్తు చేసుకునేందుకు నేతాజీ పుట్టిన రోజును ‘పరాక్రమ్ దివస్’గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా నేతాజీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ప్రారంభించడంతో పాటు స్మారక నాణెం, తపాళా స్టాంప్‌ను విడుదల చేయనున్నారు. అలాగే కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీని సందర్శించనున్నారు. ఇక్కడ కళాకారులు, సమావేశంలో పాల్గొనే వారితో ప్రధాని సంభాషించనున్నారు. అసోంలో శివసాగర్‌లో 1.06లక్షల మందికి భూ కేటాయింపు పత్రాలను పంపిణీ చేయనున్నారు. అసోంలో 2016లో 5.75లక్షల మంది భూమి లేని కుటుంబాలకు.. భూమి కేటాయించి వారికి భద్రతను కల్పించాలని సంకల్పంచింది. గత మే నుంచి 2.28లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసింది. తాజాగా మరో లక్ష మందికి పట్టాలను ప్రధాని చేతుల మీదుగా పంపిణీ చేయనుంది.
తాజావార్తలు
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు