బుధవారం 27 జనవరి 2021
National - Nov 27, 2020 , 16:10:59

రేపు భార‌త్‌బ‌యోటెక్‌కు ప్ర‌ధాని మోదీ

రేపు భార‌త్‌బ‌యోటెక్‌కు ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రేపు హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.  న‌గ‌రానికి చెందిన భార‌త్‌బ‌యోటెక్ సంస్థ‌.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే.  క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం భార‌త్ స్వదేశీయంగా త‌యారు చేస్తున్న మొట్ట‌మొద‌టి వ్యాక్సిన్ కోవాగ్జిన్‌.  అయితే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. రేపు సాయంత్రం 3.40 నిమిషాల‌కు హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు  సిటీ పోలీసు క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ఓ మీడియాతో తెలిపారు.  భార‌త్‌బ‌యోటెక్ సంస్థ‌ను సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల మ‌ధ్య ప్ర‌ధాని మోదీ విజిట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.  సాయంత్రం 5.40 నిమిషాల‌కు ప్ర‌ధాని మ‌ళ్లీ తిరుగుప్ర‌యాణం అవుతార‌ని తెలుస్తోంది. 

హైద‌రాబాద్‌కు రావ‌డానికి ముందు ప్ర‌ధాని మోదీ.. తొలుత అహ్మ‌దాబాద్ వెళ్తారు. అక్క‌డ ఉన్న జైడ‌స్ కాడిలా ప్లాంట్‌ను ఆయ‌న విజిట్ చేస్తారు.  చంగోదార్ పారిశ్రామిక వాడ‌లో ఉన్న ప్లాంట్‌కు మోదీ వెళ్ల‌నున్నారు.  జైడ‌స్ కంపెనీ జైకోవ్ డీ టీకాను అభివృద్ధి చేస్తున్న‌ది.  ప్ర‌స్తుతం ఆ వ్యాక్సిన్‌కు చెందిన రెండ‌వ‌ ద‌శ ట్ర‌య‌ల్స్ సాగుతున్నాయి.  రేపు ఉద‌యం 9.30 నిమిషాల‌కు జైడ‌స్ ప్లాంట్‌ను మోదీ విజిట్ చేయ‌నున్నారు. అహ్మ‌దాబాద్ నుంచి మోదీ నేరుగా పుణె వెళ్తారు. అక్క‌డ ఆయ‌న సీరం సంస్థ‌లో టీకా ప‌నుల‌పై స‌మీక్ష నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి.  ఆస్ట్రాజెన్‌కా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ.. కోవిడ్‌19‌పై సీరంతో క‌లిసి టీకాను అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే.  


logo