సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 10:47:44

29 ఏళ్ల త‌ర్వాత అయోధ్య‌కు మోదీ.. రామ్‌ల‌ల్లాను ద‌ర్శించుకుంటున్న తొలి ప్ర‌ధాని

29 ఏళ్ల త‌ర్వాత అయోధ్య‌కు మోదీ.. రామ్‌ల‌ల్లాను ద‌ర్శించుకుంటున్న తొలి ప్ర‌ధాని

హైద‌రాబాద్ : స‌ర్వోత్త‌ముడు, ఉత్త‌మ పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య న‌గ‌రానికి ప్ర‌ధాని మోదీ బ‌య‌లుదేరి వెళ్లారు.  శ్రీరామ‌జ‌న్మ‌భూమి వ‌ద్ద ఇవాళ భూమిపూజ జ‌ర‌గ‌నున్న‌ది.  మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు భూమిపూజ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.  ఈ వేడుక‌లో పాల్గొనేందుకు మోదీ వెళ్లారు. 29 ఏళ్ల త‌ర్వాత మోదీ.. అయోధ్య‌కు వెళ్తున్నారు. 29 ఏళ్ల త‌ర్వాత ప్ర‌ధాని మోదీ అయోధ్య‌కు వెళ్తున్న సంద‌ర్భంగా ఆ న‌గ‌రాన్ని యూపీ ప్ర‌భుత్వం స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించింది.  అయోధ్య‌లో ఉన్న రామ్‌ల‌ల్లాను ద‌ర్శించుకుంటున్న తొలి ప్ర‌ధాని కూడా మోదీ కానున్నారు. 1991లో మోదీ చివ‌రిసారి అయోధ్య వెళ్లారు.  ఆ రోజుల్లో బీజేపీ అధ్య‌క్షుడు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి.. తిరంగా యాత్ర చేప‌ట్టారు.  ఆ యాత్ర స‌మ‌యంలో మోదీ అయోధ్య విజిట్ చేశారు.  2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఫైజాబాద్‌లో ర్యాలీలో పాల్గొన్నా ఆయ‌న అయోధ్య వెళ్ల‌లేదు. 


logo