ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 16:46:35

అయోధ్యలో మోదీ ముందు పూజలు చేసేది ఈ ఆలయంలోనే

అయోధ్యలో మోదీ ముందు పూజలు చేసేది ఈ ఆలయంలోనే

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ ఆగస్టు 5న శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ముందు ఆయన అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రధాని మోదీ అయోధ్యలోని రామజన్మభూమి ప్రాంతానికి వెళ్లే ముందు మార్గమధ్యలోని హనుమాన్ దేవాలయం వద్ద ఏడు నిమిషాలపాటు ఉండి పూజలు నిర్వహిస్తారని ఆలయం ప్రధాన పూజారి మహంత్ రాజు దాస్ మీడియాకు తెలిపారు. హనుమాన్ గుడికి చేరేందుకు ముందుభాగంలో 85, వెనుక 36 మెట్లు ఉన్నాయని చెప్పారు. ఈ గుడి సందర్శనకు చాలా తక్కువ సమయం కేటాయించడంతో మోడీ ఏ మార్గంలో వెళ్తారన్నది ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు. అయోధ్యలోని హనుమాన్ ఘాటీ ఆలయం పదో శతాబ్ధానికి చెందినది. ఈ నగరంలో ఉన్న పురాతనమైన ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ఒకటి.
logo