సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 12:29:17

హోలీ వేడుకలకు మోదీ దూరం

హోలీ వేడుకలకు మోదీ దూరం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా చేయాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఒకే ప్రదేశంలో వేలాది మంది సామూహికంగా హోలీ వేడుకలను నిర్వహించుకుంటున్న విషయం విదితమే. ఉత్తర భారతదేశంలో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో హోలీ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి.

ఇండియాలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 21కి చేరింది. 21 మందిలో 14 మంది ఇటలీ పర్యాటకులు, ఒక ఇండియన్‌(ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఉన్న వ్యక్తి), ముగ్గురు కేరళ వాసులు, ఒకరు ఢిల్లీ, ఒకరు ఆగ్రా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. కేరళలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 


logo