గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 11, 2020 , 12:57:46

ప‌ది రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని స‌మీక్ష‌!

ప‌ది రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని స‌మీక్ష‌!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రతపై ప్ర‌ధాని సమీక్ష చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులు, అన్‌లాక్‌ 3 అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సీఎంలను ప్ర‌ధాని అడిగి తెలుసుకుంటున్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు ప్రధానికి వివరిస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతోపాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్, బీహార్‌‌ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక‌ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్య ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. తెలంగాణ త‌ర‌ఫున సీఎం కేసీఆర్‌తోపాటు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి ఈ సమీక్షా సమావేశం కొన‌సాగుతున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo