శుక్రవారం 10 జూలై 2020
National - Jun 25, 2020 , 18:09:17

26న ‘ఆత్మ నిర్భర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్గార్‌ అభియాన్‌’ ప్రారంభం

26న ‘ఆత్మ నిర్భర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్గార్‌ అభియాన్‌’ ప్రారంభం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 26న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో ఆత్మ నిర్భర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్గార్‌ అభియాన్‌ కార్యక్రమాన్నివీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, పారిశ్రామిక సంఘాలతో కలిసి పెట్టుబడులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టించడం దీని ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిశ్రమలు, ఉత్పత్తి సంస్థలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు పెంచనున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు, గ్రామీణ ప్రాంత కార్మికులకు ఉపాధి కల్పించడమే కార్యక్రమ ఉద్దేశం. వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం జూన్‌ 20న గరీబ్‌ కల్యాణ్‌ రోజ్గార్‌ అభియాన్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. 


logo