7న ఆగ్రా మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభించనున్న ప్రధాని

న్యూఢిల్లీ : ఆగ్రా మెట్రోరైల్ ప్రాజెక్ట్ (ఏఎంఆర్పీ) పనులను సోమవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఆగ్రాలోని 15 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
రెండు కారిడార్లలో 29.4 కిలోమీటర్ల దూరం ఈ మెట్రో నిర్మాణం కొనసాగనుంది. ప్రధానంగా తాజ్‌మహాల్, ఆగ్రాకోట, సికందర్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను ఈ మార్గం కలపనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే స్థానికంగా 26 లక్షల మందితోపాటు ఏటా ఢిల్లీకి వచ్చే 60 లక్షల మంది పర్యాటకుల రాకపోకలకు ఎంతగానో దోహదం చేస్తుందని పీఎంఓ పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు 8379.62 కోట్లును ప్రభుత్వం కేటాయించింది. ఐదేండ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది మార్చి 8న ప్రధాని యోదీ శంకుస్థాపన చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు