గురువారం 21 జనవరి 2021
National - Dec 20, 2020 , 14:40:39

రేపు వియత్నాం ప్రధానితో మోదీ సమావేశం

రేపు వియత్నాం ప్రధానితో మోదీ సమావేశం

న్యూడిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వియత్నాం ప్రధాని న్గుయెన్‌ జువాక్‌ ఫుక్‌తో వర్చువల్‌ విధానంతో సమావేశం కానున్నారు. సమగ్ర సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, భవిష్యత్ అభివృద్ధిపై ఇద్దరు ప్రధానులు సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో వియత్నాం వైస్‌ ప్రెసిడెంట్‌ భారతదేశ సందర్శనపై చర్చించేందుకు ఏప్రిల్‌లో ఇద్దరు ప్రధానులు టెలీఫోన్‌ ద్వారా సంభాషించారు. గత నెలలోనూ 17వ ఏషియన్‌-ఇండియా శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలోనూ న్గుయెన్‌ జువాక్‌ ఫుక్‌, మోదీ ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. సోమవారం జరిగే సమావేశంలో ఇరువురు నాయకులు విస్తృత ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు. భారతదేశం-వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, భవిష్యత్తు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని, అవసరమైతే జాయింట్ విజన్‌ను ప్రకటించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 


logo