శుక్రవారం 03 జూలై 2020
National - Jun 16, 2020 , 01:45:06

నేడు, రేపు సీఎంలతో మోదీ సమావేశం

నేడు, రేపు సీఎంలతో మోదీ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల(యూటీ) సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ సడలింపులపై చర్చించనున్నారు. అన్‌లాక్‌ 1 పేరుతో ఇప్పటికే పరిశ్రమలకు, వ్యాపారాలకు వెసులుబాట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకొన్నది. వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆయన మంగళవారం 21 రాష్ర్టాలు, యూటీలు, బుధవారం 15 రాష్ర్టాలు, యూటీల నేతలతో సమావేశం నిర్వహిస్తారు.


logo