శనివారం 04 జూలై 2020
National - Jun 17, 2020 , 13:36:32

చైనాతో స‌రిహ‌ద్దు స‌మస్య‌.. 19న ప్ర‌ధాని అఖిల ప‌క్ష స‌మావేశం

చైనాతో స‌రిహ‌ద్దు స‌మస్య‌.. 19న ప్ర‌ధాని అఖిల ప‌క్ష స‌మావేశం

హైద‌రాబాద్‌: భార‌త‌, చైనా స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. తాజాగా సోమ‌వారం రాత్రి జ‌రిగిన దాడిలో.. గాల్వ‌న్‌లో 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.  అయితే భార‌త‌, చైనా స‌రిహ‌ద్దు విష‌యాన్ని చ‌ర్చించేందుకు.. ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈనెల 19వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌కు అఖిల ప‌క్ష భేటీ ఉంటుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం పేర్కొన్న‌ది. ఈ స‌మావేశంలో వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అధ్య‌క్షులు పాల్గొంటార‌ని పీఎంవో త‌న ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేసింది. logo