బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 03:27:12

సోషల్‌ మీడియాకు మోదీ వీడ్కోలు?

సోషల్‌ మీడియాకు మోదీ వీడ్కోలు?

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రధాని నరేంద్రమోదీ.. అన్ని సామాజిక మాధ్యమాల నుంచి వైదొలుగాలని యోచిస్తున్నట్లు సోమవారం అనూహ్య ప్రకటన చేశారు. ‘ఈ ఆదివారం.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఖాతాలకు వీడ్కోలు చెప్పాలని భావిస్తున్నా. దీనిపై మీకు తెలియజేస్తా’ అని ప్రధాని ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆయన ట్వీట్‌ చేసిన అరగంటలోపే 14,000 మంది ఆ పోస్ట్‌ను రీట్వీట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతల్లో ప్రధాని మోదీ ఒకరు. ఆయనకు ట్విట్టర్‌లో 5.33 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది పాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతల్లో మోదీ మొదటిస్థానంలో ఉన్నారు. ఆయనకు 3 కోట్లమందికిపైగా ఫాలోవర్లు ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు 1.49 కోట్లు, ఒబామాకు 2.48 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


ద్వేషాన్ని వీడండి.. 

సోషల్‌ మీడియాను కాదు: రాహుల్‌

సోషల్‌ మీడియా నుంచి వైదొలుగాలని యోచిస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ద్వేషాన్ని విడనాడాలని, సామాజిక మాధ్యమాలను కాదని చురకలంటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌చేశారు. 


logo