సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 12:43:56

రేపు 7 రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని భేటీ

రేపు 7 రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని భేటీ

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌‌ ముఖ్య‌మంత్రుల‌తో బుధ‌వారం ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రుల‌తోపాటు ఆ ఏడు రాష్ట్రాల ఆరోగ్య‌మంత్రులు కూడా పాల్గొన‌నున్నారు. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న తీరు, ఆ వైర‌స్‌ను అరిక‌ట్ట‌డానికి చేప‌డుతున్న చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. 

క‌రోనా విస్తృతి ఎక్కువ‌గా ఉన్న ఏడు రాష్ట్రాలు/‌కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి. ఈ ఏడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆరోగ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ సెప్టెంబ‌ర్ 23న ఉన్న‌త‌స్థాయి భేటీ నిర్వ‌హించ‌నున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.   ‌     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo