శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 08:31:15

కరోనా వైర‌స్‌.. జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న మోదీ

కరోనా వైర‌స్‌.. జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న మోదీ

హైద‌రాబాద్‌:  క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఇండియాలో ఆ కేసుల సంఖ్య 151కి చేరుకున్న‌ది.  నోవెల్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.  ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఆ వైర‌స్‌ను ఎలా ఎదుర్కోవాల‌న్న అంశాల‌ను మోదీ దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకోనున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. 

భార‌త్‌లో క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు చ‌నిపోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారిగా మారిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది.  దేశంలో అన్ని రాష్ట్రాలు అనేక ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నాయి.  విదేశాల నుంచి వ‌స్తున్న వారిపై స్క్రీనింగ్ నిర్వ‌హిస్తున్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా సోకిన వారి కేసులు రెండు ల‌క్ష‌లు దాటాయి. ఆ వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 8 వేలు దాటింది.  


logo