గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 07:51:26

నేడు స్మార్ట్‌ హ్యాకథాన్‌ ఫైనల్.. విద్యార్థులతో ప్ర‌ధాని మోదీ ముచ్చ‌ట

నేడు స్మార్ట్‌ హ్యాకథాన్‌ ఫైనల్..  విద్యార్థులతో ప్ర‌ధాని మోదీ ముచ్చ‌ట

న్యూఢిల్లీ: విద్యార్థుల్లో సృజ‌నాత్మ‌క‌త‌ను పెంపొందించ‌డంలో భాగంగా ప్రారంభించిన‌ స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్-2020 ఫైనల్ ఈరోజు జరగనున్నది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థులతో ముచ్చటించనున్నారు. రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుక్కోవడమే లక్ష్యంగా ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నారు. 


మొత్తం 243 సమస్యలకు పరిష్కారం కనుగొనడం కోసం 10వేల మంది విద్యార్థులు ఫైనల్‌ పోటీలో ఉన్నారు. విద్యార్థుల ఆలోచనా పరిధిని, నైపుణ్యాలను పెంచేందుకు 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ఏడాదే 42 వేల మంది విద్యార్థులు పాల్గొనగా ఈసారి 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్నారు. తుది రౌండ్‌లో లక్ష మంది పాల్గొన‌నున్నారు. 37 కేంద్ర ప్ర‌భుత్వ విభాగాలు, 17 రాష్ట్ర ప్ర‌భుత్వాలు, 20 ప‌రిశ్ర‌మ‌లు పంపిన స‌మ‌స్య‌ల‌కు విద్యార్థులు త‌మ ప‌రిష్కారాలు తెల‌ప‌నున్నారు. 


logo