బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 06:21:15

నూత‌న విద్యావిధానంపై ప్ర‌సంగించ‌నున్న‌ ప్ర‌ధాని

నూత‌న విద్యావిధానంపై ప్ర‌సంగించ‌నున్న‌ ప్ర‌ధాని

న్యూఢిల్లీ: ‌నూత‌న జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)పై ప్ర‌ధాని మోదీ నేడు జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఎన్ఈపీ ప్ర‌కారం ఉన్న‌త విద్య‌లో సంస్క‌ర‌ణ‌ల‌పై కేంద్ర విద్యాశాఖ‌, యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) సంయుక్తంగా స‌మావేశం నిర్వ‌హిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ప్రారంభోప‌న్యాసం చేయ‌నున్నారు. 

కాగా, ఉన్న‌త విద్యా వ్య‌వ‌స్థ‌లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారుల‌తోపాటు అందులో భాగ‌స్వాములైనవారికి ఎన్ఈపీపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని దేశంలోని విశ్వ‌విద్యాల‌యాలు, కాలేజీల‌ను  యూజీసీ ఆదేశించింది.  


logo