మంగళవారం 14 జూలై 2020
National - Jun 17, 2020 , 15:03:27

జాతినుద్దేశించి ఈ 21న ప్రధాని మోదీ ప్రసంగం

జాతినుద్దేశించి ఈ 21న ప్రధాని మోదీ ప్రసంగం

ఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతీ ఏడాది జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయూష్‌ మంత్రిత్వశాఖ ఈ ఏడాది థీమ్‌గా యోగా ఎట్‌ హోం, యోగా విత్‌ ఫ్యామిలీ ని ప్రమోట్‌ చేస్తుంది. ఈ ఏడాది కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి యోగాను ప్రాక్టీస్‌ చేయాల్సిందిగా సూచించింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యోగా ద్వారా శరీరాన్ని అదేవిధంగా మనస్సును ధృడంగా ఉంచుకోవచ్చంది. వ్యాధిపై పోరాడేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని తెలిపింది. 


logo