మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 14:11:34

భారత జీవన విధానంలో శ్రీరాముడు : మోదీ

భారత జీవన విధానంలో శ్రీరాముడు : మోదీ

లక్నో :  భారత జీవనవిధానంలో శ్రీరాముడు ఉన్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శ్రీరాముడి వంటి పురుషోత్తముడికి భవ్యమందిర నిర్మాణం రూపుదిద్దుకోబోతుందన్నారు. రాముడి ఆదర్శాలు కలియుగంలో పాటించేందుకు మార్గమిది అని చెప్పారు. ఈ మందిరం నిర్మాణం జాతీయ భావన అని పేర్కొన్నారు. కోట్ల మంది మనో సంకల్పానికి ప్రతీక ఈ మందిరం అని తెలిపారు. రాముడు భారతదేశ మర్యాద అని మోదీ పేర్కొన్నారు.

రాముడి కార్యక్రమాలన్నీ హనుమంతుడే చేస్తాడు. హనుమంతుడి ఆశీస్సులతో నేడు రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిందన్నారు. నరుడిని నారాయణుడితో కలిపే ఉత్సవమిది. ఈ రోజు కోట్లాది రామభక్తుల సంకల్పం నేరవేరుతుందన్నారు. రాళ్లతో రామసేతును నిర్మించారు. సూర్యుడంత తేజస్సు, భూదేవి అంత సహనం రాముడి సొంతమని మోదీ చెప్పారు. భారత్‌ ఆదర్శంలో రాముడు ఉన్నారు. మహాత్ముడి అహింస నినాదంలోనూ శ్రీరాముడు ఉన్నారని మోదీ పేర్కొన్నారు. 


logo