కొవిడ్ వ్యాక్సిన్లపై మోదీ భరోసా!

న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీలోని వారణాసికి చెందిన వ్యాక్సిన్ లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తమకు ఎదురైన అనుభవాలను వారు ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ల ద్వారా భారత్ విస్పష్ట సంకేతం పంపిందని అన్నారు. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి కట్టడికి భారత్ సొంతంగా ఒకటికి రెండు వ్యాక్సిన్లను రూపొందించిందని, దేశంలోని ప్రతి మూలకూ వ్యాక్సిన్లను చేరవేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో భారత్ స్వయం సమృద్ధిని చాటిందని చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్లను భారత్ పలు దేశాలకు తరలిస్తుందని చెప్పారు. దేశంలో తయారైన రెండు కరోనా వ్యాక్సిన్లూ సురక్షితమని భరోసా ఇచ్చారు. గతంలో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని తనపై ఒత్తిడి ఉండేదని, అయితే వ్యాక్సిన్ విషయంలో రాజకీయ నేతలు చేసేదేమీ ఉండదని, అది శాస్త్రవేత్తల పనని తాను చెబుతుండేవాడినని గుర్తుచేశారు. వారణాసి నుంచి తాను ఎన్నికైన అనంతరం ఆ ప్రాంతంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైరస్‌పై ముందుండి పోరాడిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు సహా మూడు కోట్ల మందికి తొలిదశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
తాజావార్తలు
- కరోనాతో ఖండ్వ ఎంపీ మృతి
- మీడియాపై కస్సుబుస్సుమంటున్న సురేఖ వాణి కూతురు
- రాజ్యసభ, లోక్‌సభ టీవీలు.. ఇక నుంచి సన్సద్ టీవీ
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు