మంగళవారం 14 జూలై 2020
National - Jun 06, 2020 , 14:49:04

యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనేది డౌటే!

యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనేది డౌటే!

న్యూఢిల్లీ: ఈ నెల 21న లేహ్‌లో జరగనున్న అతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం అనుమానమేనని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ప్రధాని పాల్గొనకపోవచ్చని అధికారులు వెల్లడించారు. యోగా దినోత్సవ ప్రధాన వేడుకలు లేహ్‌లో జరుగుతాయని, ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారని మంత్రిత్వ శాఖ అధికారులు మార్చి నెలలో ప్రకటించారు. అయితే తాజాగా జూన్‌ 21న ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆయుష్‌ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్‌ కొటేచా తెలిపారు.  కరోనా నేపథ్యంలో యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.  

లేహ్‌లో జరిగే ప్రధాన వేడుకలు ముఖ్యమైన కార్యక్రమమే అయినప్పటికి.. వాటిని డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. ‘యోగా ఎట్‌ హోమ్‌ అండ్‌ యోగా విత్‌ ఫ్యామిలీ’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుందామని చెప్పారు. వర్చువల్‌ వీడియోద్వారా జూన్‌ 21న ఉదయం 7 గంటల నుంచి ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చని తెలిపారు.


logo