సోమవారం 01 జూన్ 2020
National - May 18, 2020 , 17:58:02

కేంద్ర హోంశాఖ, ఎన్డీఎంఏ అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష

కేంద్ర హోంశాఖ, ఎన్డీఎంఏ అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష

న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ, ఎన్డీఎంఏ (జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ) అధికారులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ప్రధాని ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. 

ఉమ్‌ పున్‌ తుఫాన్ తీరం వైపు వేగంగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తుండటంతో..అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 37 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు తరలించినట్లు ఆ విభాగం డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo