ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 20:49:21

అభివృద్ధికి ఊత‌మిచ్చేలా క్యాబినెట్ నిర్ణ‌యాలు: ప‌్ర‌ధాని

అభివృద్ధికి ఊత‌మిచ్చేలా క్యాబినెట్ నిర్ణ‌యాలు: ప‌్ర‌ధాని

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని, దేశ ఆర్థికవృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించిన అనంతరం ప్ర‌ధాని స్పందించారు. ఆర్థికవృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ చర్యలు దోహదపడతాయని చెప్పారు. రైతులు, గ్రామాలు, చిన్న వ్యాపారాలకు సహాయపడే విధంగా వేగంగా అడుగులు చ‌ర్య‌లు చేపడుతున్నామ‌ని ప్ర‌ధాని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఖుషినగర్ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం కానుందని, ఇందవల్ల యూపీతో అనుసంధానం గణనీయంగా పెరుగుతుందని, మరింత మంది టూరిస్టులను ఆకర్షించడంతోపాటు స్థానికులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ప్ర‌ధాని తెలిపారు. పశు సంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుతో ఆరుగాలం కష్టపడే రైతుల ఆదాయం పెరుగుతుందని, పాడిపరిశ్రమలో పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. 

శిషు లోన్ అకౌంట్లకు వడ్డీ రాయితీ పథకం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతర‌హా పరిశ్రమల రంగానికి మేలు జరుగుతుందని, ఎంఎస్ఎంఈ రంగం పటిష్టతకు కేంద్ర ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ప్ర‌ధాని పేర్కొన్నారు. 


logo