సోమవారం 01 జూన్ 2020
National - May 22, 2020 , 15:37:39

ఒడిశా చేరుకున్న ప్రధాని మోదీ..

ఒడిశా చేరుకున్న ప్రధాని మోదీ..

భువనేశ్వర్‌: తుఫాను ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ ఒడిశాకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కోల్‌కతా నుంచి వచ్చిన మోదీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, గవర్నర్‌ గణేషీలాల్‌, ఇతర అధికారులు భువనేశ్వర్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.  

అంఫాన్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కరు కూడా మరణించలేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను వల్ల కోస్తా జిల్లాల్లో సుమారు 45 లక్షల మందిని ప్రభావితం చేసిందని, పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం సంభవించిందని వెల్లడించింది. ఈ తుఫాను వల్ల మరణించినట్లు తమ వద్ద అధికారిక సమాచారం లేదని వెల్లడింది.

తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌లో ప్రధాని మోదీ ఇప్పటికే పర్యటించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. రాష్ర్టానికి రూ.వెయ్యి కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.


logo